రామ్ చరణ్, శంకర్ కలయికలో వస్తున్న సినిమా RC15.

కాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ చరణ్ పుట్టినరోజున (మార్చి 27) రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ట్విట్టర్‌లో రెండు పేరులు ట్రెండ్ అవుతున్నాయి.

వాటిలో ఒకటి CEO (చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్).

ఈ టైటిల్‌తో పాటు చిత్ర యూనిట్ సేనాని, సైనికుడు అనే టైటిల్స్ కూడా అనుకోగా..

దర్శకుడు శంకర్ 'సైనికుడు'కి ఓటు వేస్తే, చిత్ర యూనిట్‌లో ఎక్కువమంది 'సేనాని'కి ఓటు వేశారట. 

పవన్ కళ్యాణ్‌ని పొలిటికల్‌గా సేనాని అని పిలుస్తారు. దీంతో ఈ టైటిల్ అయితే బాగుండని మెగా అభిమానులు అనుకుంటున్నారు.

అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.