పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ నిన్న షూటింగ్ జరుపుకుంది.
ఈ ఎపిసోడ్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ నెలకుంది.
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ని ఏ విషయాలు గురించి ప్రశ్నించి ఉంటాడు అని అందరిలో ఆశక్తి నెలకుంది.
ఈ ఎపిసోడ్లో పవన్ మూడు పెళ్లిళ్ల వెనుక ఉన్న రీజన్ కూడా చెప్పాడు అని తెలుస్తుంది.
ఈ ఎపిసోడ్‌కి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా హాజరయ్యాడు.
ఈ షోలో బాలకృష్ణ, రామ్‌చరణ్‌కి కాల్ చేసి పవన్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు.
అలాగే రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టమని బాలయ్య, పవన్‌ని ప్రశ్నించాడు.
మరి ఈ ప్రశ్నకి పవన్ కళ్యాణ్ ఏమి సమాధానం చెప్పాడో అనేది ఎపిసోడ్ రిలీజ్ తరువాత తెలుసుకోవాలి.