మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు.

దీంతో ఈ హీరో తదుపరి సినిమా పై అందరిలో ఎంతో ఆసక్తి నెలకుంది.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 వర్కింగ్ టైటిల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు.

పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు.

దీంతో అభిమానులు అప్డేట్ ఇవ్వాలంటూ దర్శక నిర్మాతలను అడుగుతున్నారు.

కాగా మార్చి 27న చరణ్ బర్త్ డే ఉన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మార్చి 27నే మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని.. 

రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.