మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, షారుఖ్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'జవాన్'.

ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్‌లో తమిళ స్టార్ విజయ్ చేస్తున్నాడు.

తెలుగులో ఆ పాత్రని రామ్‌చరణ్‌తో చేయించడానికి డైరెక్టర్ ఆలోచిస్తున్నాడట.

ఆస్కార్ ప్రమోషన్స్ నుంచి చరణ్ తిరిగి రాగానే అట్లీ కథ వినిపించనున్నాడని తెలుస్తుంది.

షారుఖ్‌తో మంచి స్నేహం ఉన్న రామ్‌చరణ్.. ఒకే చెప్పే అవకాశం ఉంది.

ఇటీవల పఠాన్ తెలుగు ట్రైలర్‌ని చరణ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

అయితే గతంలో ఈ పాత్ర కోసం అల్లు అర్జున్‌ని కూడా అట్లీ సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి.