రామ్‌చరణ్ ఇటీవల ఇండియా టుడే నిర్వహించే స్పీకర్ షిప్ సమ్మిట్ India Today Conclave ప్రోగ్రాంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఈ సమ్మిట్‌లో చరణ్‌ని నెపోటిజం గురించి ప్రశ్నించారు.

యశ్ ఫాదర్ ఒక రిక్షా తొక్కే వ్యక్తి, మీ ఫాదర్ మెగాస్టార్. ఇద్దరు ఇండియాలో సూపర్ స్టార్స్ అయ్యారు. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందంటారా? అని ప్రశ్నించారు.

చరణ్ బదులిస్తూ.. నెపోటిజం గురించి ఈ మధ్య బాగా వింటున్నా.

స్టార్ కొడుకు స్టార్ అవ్వాలన్నా, టాలెంట్ తప్పకుండా ఉండాల్సిందే.

టాలెంట్ లేకపోతే ఆడియన్స్ కూడా ఆదరించారు.

నా ఫాదర్ ఎంట్రీ పాస్‌తో నేను ఎంట్రీ ఇచ్చాను. ఇప్పటికీ 14 ఏళ్ళ అయ్యింది. టాలెంట్ లేకపోతే ఇక్కడి వరకు వచ్చి ఉండను కదా!

ఇది నాకు మాత్రమే కాదు, వారసులుగా వచ్చిన అందరికి వర్తిస్తుంది అని చెప్పుకొచ్చాడు.