ఆస్కార్ కోసం కొన్ని రోజులుగా అమెరికాలోనే ఉంటున్న RRR టీమ్..

ఆస్కార్ గెలుచుకోవడంతో హైదరాబాద్ తిరిగి వస్తున్నారు.

ఇటీవలే ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకోగా..

ఈరోజు రాజమౌళి, కీరవాణి ఆస్కార్‌తో హైదరాబాద్ చేరుకున్నారు.

రామ్ చరణ్ మాత్రం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు.

India Today Conclave స్పీకర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి చరణ్‌కి ఆహ్వానం వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డైరెక్ట్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు.

ఈ ప్రోగ్రాంలో చరణ్.. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రసగించనున్నాడు.