ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్-K.

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

సూపర్ హీరోస్ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.

దీంతో ఈ సినిమా కోసం దర్శకుడు ప్రతి వస్తువు కొత్తగా తయారు చేయిస్తున్నాడు.

ఇటీవల ఒక పెద్ద టైర్ ని మేకింగ్ చేస్తున్న వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె, దిశా పటాని నటిస్తున్నారు.

ఇవాళ దీపికా పడుకోణె పుట్టినరోజు కావడంతో.. ఆమెకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ మేకర్స్.