ప్రభాస్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ ఎపిసోడ్‌ని ఈ నెల 30‌న న్యూ ఇయర్ కానుగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ బాహుబలి ఎపిసోడ్‌ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

ది బిగినింగ్ ఎపిసోడ్‌.. ఈ నెల 30న రిలీజ్ అవుతుంది.

ది కన్‌క్లూజన్ ఎపిసోడ్‌.. జనవరి 6న రిలీజ్ కానుంది.

కంటెంట్ మొత్తం బాగుండడంతో, ఏమాత్రం ఎడిట్ లేకుండా టోటల్ ఎపిసోడ్ షూట్‌ని టెలికాస్ట్ చేస్తున్నారు.

ఇవాళ ది బిగినింగ్ ఎపిసోడ్‌‌కి సంబంధించిన కొత్త ప్రోమోని రిలీజ్ చేశారు.