రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి కొత్త సినిమాల అప్డేట్‌లు ఇస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్-K, మారుతీతో చేస్తున్న సినిమాల్లో నటిస్తున్నాడు.
ఈ సినిమాలు తరువాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
‘స్పిరిట్’ అనే టైటిల్‌ని పెట్టుకున్న ఈ మూవీని బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ నిర్మాత మాట్లాడుతూ.. ఈ మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలు కానున్నట్లు వెల్లడించాడు.
ఈ మూవీలో ప్రభాస్ రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేశాడు.
ఈ సినిమాతో ప్రభాస్ మొదటిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేశాడు.