'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది పూజా హెగ్డే.

'దువ్వాడ జగన్నాథం' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారి, అగ్రహీరోల సినిమాలో ఛాన్సులు అందుకుంది.

'అలా వైకుంఠపురం' మూవీతో అవార్డులు అందుకొని, ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది.

రాధేశ్యామ్ సినిమా నుంచి ఈ అమ్మడి కష్టాలు మొదలయ్యాయి. బీస్ట్, ఆచార్య చిత్రాలు కూడా ప్లాప్‌గా నిలిచాయి.

ఇప్పుడు హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో నటించిన 'సర్కస్' కూడా డిజాస్టర్ అయ్యింది.

దీంతో ఈ బుట్టబొమ్మని దర్శకనిర్మాతలు పక్కన పెట్టేస్తున్నారు.

ప్రస్తుతం పూజా చేతిలో.. సల్మాన్ ఖాన్ అండ్ మహేష్ బాబుతో ఒక్కో మూవీ ఉంది.

ఈ రెండిటిలో సల్మాన్ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగా, మహేష్ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

పూజా కెరీర్ మళ్ళీ గాడిలో పడాలి అంటే, ఈ సినిమాలు తప్పకుండా హిట్ అవ్వాలి.