పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ విషయంలో వేగం పెంచేశాడు.

ప్రస్తుతం వీరమల్లు షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి వినోదయ సిత్తం రీమేక్‌లో నటిసున్నాడు.

ఈ మూవీలో పవన్ రోల్‌కి సంబంధించిన షూటింగ్ ఈ నెలాఖరుతో పూర్తి కానుంది.

కాగా ఏప్రిల్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడట.

ఈ షూటింగ్ కోసం హరీష్ శంకర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి భారీ సెట్‌ని నిర్మిస్తున్నాడు.

ఇక గతంలో పవన్, హరీష్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవ్వడంతో..

ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ చిత్రంలో కూడా పవన్ పోలీస్ రోల్ ప్లే చేస్తున్నాడు.

మరి ఈ సినిమాతో ఏ రేంజ్ ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.