పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, The OG సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాలతో పాటు తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన 'వినోదయ సిత్తం' ని పవన్ రీమేక్ చేస్తున్నాడు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

కానీ ఈ మూవీ మాత్రం అధికారికంగా లాంచ్ అవ్వకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే ఒక సందేహం నెలకుంది అందరిలో.

తాజాగా పవన్ ఈ సినిమాని అధికారికంగా పట్టాలెక్కించేశాడు.

కార్తికేయ-2, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

తెలుగులో కూడా ఈ చిత్రాన్ని సముద్రఖనినే డైరెక్ట్ చేస్తున్నాడు.

ఫాంటసీ డ్రామా కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ మోడరన్ దేవుడిగా, సాయి ధరమ్ తేజ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించబోతున్నారు.

ఇక మొదటిసారి మామ అల్లుడులు ఒకే స్క్రీన్ మీద కనబడబోతున్నారు అని తెలియడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.