పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మూవీ వినోదయ సిత్తం రీమేక్.

తమిళంలో ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మెయిన్ లీడ్ సాయి ధరమ్ తేజ్.

పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం సినిమాలో సగ భాగం మాత్రమే ఉంటుంది.

ఈ నెలాఖరుతో పవన్ షూటింగ్ కూడా పూర్తి కానుందట.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ ఏడాది జులై 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.