ప్రపంచవ్యాప్తంగా సినిమా టెక్నీషియన్స్ అంతా ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు 'ఆస్కార్'.

ఇండియన్ హిస్టరీలో ఇప్పటివరకు 6 ఈ అవార్డుని అందుకున్నారు.

1983లో మొదటిసారి 'భాను అతైయా' అనే ఆమె ఆస్కార్ అందుకుంది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా గాంధీ సినిమాకు గాను ఈ అవార్డు అందుకున్నారు.

ఆ తరువాత 1992లో భారతీయ దిగ్గజ దర్శకుడు ‘సత్యజిత్ రే’ని అకాడమీ హానరరీ అవార్డుతో గౌరవించారు. ఈ అవార్డుని అందుకున్న ఏకైక భారతీయుడిగా సత్యజిత్ నిలిచారు.

దాదాపు 17 ఏళ్ళు తరువాత ముగ్గురు భారతీయులు ఒకేసారి, ఒకే సినిమాకు ఆస్కార్ అందుకున్నారు. ఆ సినిమానే ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’.

బెస్ట్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రెసుల్ పూక్కుట్టి..

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో జయహో సాంగ్‌కు గాను గుల్జార్.. 

ఎ ఆర్ రెహమాన్ ఆస్కార్ అందుకున్నారు.

చివరిగా 2019లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో 'గునీత్ మోంగా' ఆస్కార్ అందుకున్నారు.