గత ఏడాది హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఆస్కార్ స్టేజి పై..

హాస్యనటుడు క్రిస్ రాక్‌ పై చెయ్యి చేసుకున్న సంగతి తెలిసిందే.

62 ఏళ్ళగా ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్‌తో తరాలకు ఆహ్వానం పలుకుతూ వస్తున్నారు.

అయితే ఈ ఏడాది ఆ ట్రెడిషన్‌ని బ్రేక్ చేస్తూ షాంపైన్ కలర్ కార్పెట్‌తో తరాలకు ఆహ్వానం పలుకబోతున్నారు.

కాగా ఈ ఏడాది ఆస్కార్ వేడుకకు అమెరికన్ కామెడియన్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్‌గా చేస్తున్నాడు.

జిమ్మీ కిమ్మెల్ రెడ్ కార్పెట్ చేంజ్ గురించి మాట్లాడుతూ.. లాస్ట్ ఇయర్ విల్ స్మిత్, క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టడంతో అకాడమీ ఒక్కసారిగా ఎరుపెక్కింది.

అందుకనే ఈసారి అటువంటి చెంపదెబ్బలు ఉండకుండా రెడ్ కార్పెట్ బదులు షాంపైన్ కార్పెట్ పరుస్తున్నాము అంటూ చమత్కరిస్తూ మాట్లాడాడు.

కాగా ఈ సంవత్సరం అలాంటి సంఘటనలు జరగకుండా అకాడమీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.