రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

మార్చి 12న రాత్రి (IST మార్చి 13న ఉదయం) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. 

ఈ వేడుకలో పాల్గొనేందుకు రాజమౌళి, రామ్‌చరణ్ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయారు.

తారకరత్న మరణం వలన ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఉండిపోవాల్సి వచ్చింది.

ఇటీవల తారకరత్న పెద్దకర్మ కూడా పూర్తి కావడంతో ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికా బయలుదేరాడు.

ఈరోజు (మార్చి 6) ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమెరికా పయనమయ్యాడు.

గత కొన్ని రోజులుగా పలు ప్రముఖ ఇంటర్వ్యూల్లో, అవార్డు పురస్కారాల్లో రామ్‌చరణ్ ఒక్కడే పాల్గొనడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అమెరికా బయలుదేరడంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.