రాజమౌళి తెరకెక్కించిన RRR ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలుసు.

2017 నవంబర్ 18న రాజమౌళి.. ఎన్టీఆర్ అండ్ చరణ్‌తో ఉన్న ఒక ఫోటో షేర్ చేయడంతో ప్రభంజనం మొదలైంది.

2018 మార్చిలో ఈ సినిమాని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. 

చరిత్రలో అసలు కలవని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ని ఒక దారిలోకి తీసుకురావడమే మూవీ కథ అని చెప్పడంతో..

సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎదురు చూస్తున్న.. 

ఆడియన్స్ ముందుకు 2022 మార్చి 25 వచ్చింది. నేటితో కరెక్ట్‌గా ఏడాది అయ్యింది.

ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా పలు కేటగిరీల్లో 86 నామినేషన్స్‌లో నిలువగా.. 35 అవార్డులు అందుకొని విజేతగా నిలిచింది.

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ని కూడా అందుకొని ప్రపంచ విజేతగా నిలిచింది.