ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న NTR30 మొదలైంది.

నేడు (మార్చి 23) పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.

ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ పై మొదటి సీన్‌కి రాజమౌళి క్లాప్ కొట్టగా..

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ సీన్ డైరెక్ట్ చేశాడు.

ఇక ఈవెంట్‌లో కొరటాల శివ మూవీ బ్యాక్‌డ్రాప్ కూడా రివీల్ చేశాడు.  

ఇండియాలోని కొన్ని గుర్తింపు లేని కోస్టల్ ల్యాండ్స్ కథే ఈ సినిమా.

అక్కడ మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. వాళ్ళకి దేవుడన్నా, చావన్నా భయం లేదు.

కానీ ఒక్కటి అంటే భయం. ఆ భయం ఏంటో మీకు తెలుసని చెప్పుకొచ్చాడు.