రియల్ హీరో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం లేదు.
కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం అందించి దేవుడిలా నిలిచాడు.
ఇటీవల మళ్ళీ కేసులు పెరుగుతున్న సమయంలో.. "సహాయం కావాలంటే సందేహించకుండా నాకు కాల్ చేయండి. నా పాత నెంబర్ ఇంకా పని చేస్తూనే ఉంది" అంటూ ట్వీట్ చేసి తన గొప్ప మనసుని చాటుకున్నాడు.
కానీ ఇంత మంచి మనిషి నార్తర్న్ రైల్వే వాళ్ళు హెచ్చరించారు.
ఇటీవల సోనూసూద్ రైలులో డోర్ దగ్గర కూర్చొని ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేశాడు
ఆ వీడియో వైరల్ అవ్వడంతో.. నార్తర్న్ రైల్వే కూడా దానిని చూసింది.
డియర్ సోనూసూద్.. "మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతారు. మీరు ట్రైన్‌లో ఇలా చేస్తే, అది చూసి మీ ఫాలోయర్స్ అనుసరించి, ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దయచేసి ఇది మళ్ళీ రిపీట్ చేయకండి" అంటూ ట్వీట్ చేశారు.
ముంబై రైల్వే పోలీసులు కూడా ఇలా రిపీట్ చేయవద్దు అని కోరింది.