మెగా హీరో వైష్ణవ్ తేజ్.. ప్రస్తుతం తన 4వ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీలో..

 వైష్ణవ్ తేజ్ పక్కా మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది.

ఆల్రెడీ హీరో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా విలన్‌గా చేసే నటుడుని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

మలయాళ నటుడు నేషనల్ అవార్డు విన్నర్ 'జోజు జార్జ్' ఈ సినిమాలో.. 'చెంగా రెడ్డి' పాత్ర పోషిస్తున్నాడు. 

రీసెంట్‌గా 'ఇరాట్ట' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకున్నాడు జోజు జార్జ్.