టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

హీరో నాని డైరెక్టర్ అవ్వుదాం అని ఇండస్ట్రీకి వచ్చాడు.

లెజెండరీ డైరెక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్‌గా కూడా పని చేశాడు.

కానీ అనుకోకుండా ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన అష్టాచెమ్మా సినిమాతో హీరోగా మారాడు.

అక్కడి నుంచి వరుస సినిమాలు చేస్తూ హీరోగా బిజీ అయ్యిపోయాడు.

తన సహజ నటనతో నేచురల్ స్టార్ అనే బిరుదుని అందుకున్నాడు.

'వాల్ పోస్టర్ సినిమా' అనే ప్రొడక్షన్ కంపెనీ పెట్టి నిర్మాతగా కూడా కెరీర్ మొదలుపెట్టాడు.

ఇటీవలే హిట్-2 సినిమాతో నిర్మాతగా అదిరిపోయే హిట్టుని అందుకున్నాడు.

తాజాగా నాని సోదరి దీప్తి గంట కూడా 'మీట్ క్యూట్' సినిమాతో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టుకుంది.