టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు.. నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు.

22 ఏళ్ళ వయసులో సూపర్‌స్టార్ కృష్ణ 'గూఢచారి 116' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

1200 పైగా సినిమాల్లో నటించిన చలపతి.. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరించారు.

సీనియర్ ఎన్టీఆర్‌కి చలపతి రావు వీరాభిమాని. అలాంటిది సినీ పరిశ్రమలోకి వచ్చి ఆయనతోనే అనేక సినిమాల్లో నటించాడు.

అయన తరువాత తరం బాలయ్య, ఎన్టీఆర్ సినిమాల్లో కూడా చలపతి ఎక్కువగా కనిపించేవాడు. 

అలా నందమూరి కుటుంబంతో ఒక ప్రత్యేక అనుబంధం ఉండడంతో, నేడు అయన మరణవార్త విని నందమూరి హీరోలు ఎమోషనల్ అయ్యారు.

మా నాన్నగారితో పాటు నాతో కూడా ఎన్నో సినిమాలు చేసిన చలపతిరావు గారికి మా కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది - బాలకృష్ణ 

తాతగారి నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతిరావు గారు.. మా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటూ వస్తున్నారు - ఎన్టీఆర్ 

చలపతిరావు బాబాయి అంటే వ్యక్తిగతంగా నాకు, మా కుటుంబానికి చాలా ఇష్టం - కళ్యాణ్ రామ్