నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలో ప్రస్తుతం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్నారు.

తాజాగా మరో హీరో నందమూరి కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్నాడు.

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ ఈ ఏడాది హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు.

ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కళ్యాణ్ రామ్ లాంచ్ చేశాడు.

‘బ్రీత్’ అనే టైటిల్‌ని పెట్టుకోగా.. అంతిమ పోరాటం అనే పవర్ ట్యాగ్ లైన్‌ని టైటిల్‌కి జత చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాని వంశీకృష్ణ ఆకెళ్ళ డైరెక్ట్ చేస్తున్నాడు.

నందమూరి జయకృష్ణ బసవతారకం క్రియేషన్స్ పతాకం పై మొదటి ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాము అంటూ నిర్మాత వెల్లడించాడు.