బాలకృష్ణ ఈ మధ్య ఏది మాట్లాడిన కాంట్రవర్సీ అవుతుంది.
దేవబ్రాహ్మణల కాంట్రవర్సీ, అక్కినేని కాంట్రవర్సీ.. ఇలా వరస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.
తాజాగా పవన్ అన్స్టాపబుల్ ఎపిసోడ్లో బాలయ్య మాట్లాడుతూ.. 'దానమ్మా నర్సు, భలే అందంగా ఉందిలే' అని కామెంట్ చేశాడు.
నర్సులను అవమాన పరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పాలంటూ కోరారు.
దీంతో బాలయ్య బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాడు.
రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం.
బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నేను.. నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూస్తాను.
నర్సులను కించపరిచాడంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించాడు.