ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఇటీవల మెగా ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేసింది.

వాటికి కౌంటర్ ఇస్తూ మెగా బ్రదర్ నాగబాబు, రోజాపై విమర్శలు చేశాడు. 

పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు.. అభివృద్ధి చేయడం. దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉంది.

ఇన్నాళ్లు మీరు ఏమి మాట్లాడినా స్పందించకపోవడానికి ఒకటే కారణం. 'మీ నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు' అంటూ నాగబాబు ఘాటుగా స్పందించాడు.

దీనికి మంత్రి రోజా స్పందిస్తూ.. ఏదైనా విమర్శ చేసేటప్పుడు, విషయం ఉంటేనే చెయ్యాలి. అంతేగాని నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు.

టూరిజంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. అది తెలుసుకోకుండా ఫేక్ వార్తలు ప్రచారం చేయడం సబబు కాదు.

చిరంజీవి కూడా పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కదా.. ఆయన ఏమి చేశారని, నేను ఏనాడు మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కాబట్టి నేను మాట్లాడాను.

వ్యక్తిగతంగా నాకు ఎవరితో శత్రుత్వం లేదు. పార్టీ పరంగా, సిద్ధాంతం పరంగానే నా వ్యాఖ్యలు ఉంటాయి.