మలైకా అరోరాతో హాట్ టాక్స్..

బాలీవుడ్ భామ మలైకా అరోరా 49 ఏళ్ళు వచ్చినా ఇంకా హాట్ హాట్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఐటెం సాంగ్స్ చేస్తూ అదరగొడుతుంది.

తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది మలైకా.

తాజాగా మలైకా అరోరా హోస్ట్ గా కొత్త షో ప్రారంభం అయింది.

మూవింగ్ ఇన్ విత్ మలైకా పేరుతో హాట్‌స్టార్ ఓటీటీలో సరికొత్త షో వచ్చింది.

డిసెంబర్ 5 నుంచి ఈ షో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మూవింగ్ ఇన్ విత్ మలైకా షోలో తన లైఫ్ లోని అనుభవాలు, సినీ పరిశ్రమ గురించి, అలాగే పలువురు గెస్ట్స్ ని పిలిచి వాళ్ళ గురించి మాట్లాడనుంది. అలాగే మాములు మాటలు మాత్రమే కాకుండా రొమాంటిక్ టాక్స్, హాట్ టాక్స్ చేయనున్నట్లు మలైకా చెప్పింది.