ఇటీవల మంచు విష్ణు, మనోజ్ మధ్య ఉన్న విబేధాలకు సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చిన వీడియో సంగతి తెలిసిందే.

ఇక వీడియో పై ఇప్పటి వరకు మంచు కుటుంబ సభ్యులు ఎవరు రియాక్ట్ అవ్వలేదు.

తాజాగా మోహన్ బాబు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. మనోజ్ అండ్ విష్ణు గొడవ గురించి మాట్లాడాడు.

అన్నదమ్ముల మధ్య విబేధాలు రావడం సహజమే.

అయితే ఆవేశాలతో ఆ విబేధాలను పెద్దవి చేసుకోవడమే బాధ అనిపిస్తుంటుంది.

మహాభారతంలో కూడా అన్నదమ్ములు మధ్య ఏర్పడిన చిన్నపాటి అపార్ధాలే..

చిలికి చిలికి గాలి వానగా మారాయి. నిజ జీవితంలో కూడా అంతే.

దాని వలన మనుషులు, ఆనందాలు దూరం అయ్యి బాధని అనుభవిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.