పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వైరల్ న్యూస్ బయటకి వచ్చింది.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం హరీష్ శంకర్, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని సంప్రదించాడట.

ఆ పాత్ర చేయాలంటూ మల్లారెడ్డిని, హరీష్ శంకర్ దాదాపు గంట బ్రతిమాలాడట.

ఈ విషయాన్ని స్వయంగా మల్లారెడ్డినే పబ్లిక్ స్టేజి పై తెలియజేశాడు.

కాగా ఆ పాత్ర చేయడానికి తను ఒప్పుకోలేదంటూ వెల్లడించాడు.

ఏప్రిల్ 5 నుంచి ఈ మూవీ షూటింగ్‌లో పవన్ పాల్గొనున్నాడు.

పవన్ ఈ సినిమా కోసం 90 రోజులు కాల్ షీట్లు ఇచ్చాడట.