చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నిన్న వరంగల్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కి రామ్ చరణ్ గెస్ట్‌గా హాజరయ్యాడు.

ఈ కార్యక్రమంలో చరణ్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

చిరంజీవి గారు సైలెంట్‌గా, సౌమ్యంగా ఉంటారు అని అంతా అంటారు. ఆయన అలా ఉంటేనే ఇంతమంది వచ్చారు. ఒకవేళ ఆయన తెగ్గించి మాట్లాడితే.

ఆయనని అనేవాళ్లకి ఒకటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి. 

ఆయన సైలెంట్ అయ్యి ఉండవచ్చు. కానీ ఆయన వెనుక ఉన్న మేము సైలెంట్ కాదు.

సైలెంట్ గానే చెప్తున్నాం, మేము సైలెంట్‌గా ఉండము అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

అయితే ఈ వార్నింగ్ ఏపీ మినిస్టర్ రోజాకి అంటున్నారు నెటిజెన్లు. ఇటీవల ఆమె మెగా ఫ్యామిలీ, మెగాస్టార్‌పై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.