ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు
అందుకున్న
చరణ్
RRR సినిమాతో దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు చరణ్
RRR సినిమా తర్వాత నార్త్ లో కూడా పలు ఈవెంట్స్ కి హాజరవుతున్నారు. పలు అవార్డుని అందుకుంటున్నాడు రామ్ చరణ్.
తాజాగా NDTV ట్రూ లెజెండ్ అంటూ కొన్ని రంగాలలో ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు ఇచ్చింది. సినిమా రంగంలో ఈ అవార్డు రామ్ చరణ్ ని వరించింది.
ఢిల్లీలో ఈ అవార్డుని రామ్ చరణ్ అందుకున్నారు. దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు చరణ్ కి అభినందనలు తెలుపుతున్నారు.