మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి బెస్ట్ ఫ్రెండ్ అయ్యిపోతున్నాడు.

సల్మాన్ ఖాన్ నుంచి యశ్ వరకు ప్రతి ఒకరితో మంచి స్నేహం మెయిన్‌టైన్ చేస్తూ ఒక హెల్తీ వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు.

ఇక ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో వచ్చిన ప్రతి ఒక్కరు.. ఫ్రెండ్ అంటూ చరణ్‌కి కాల్ చేస్తున్నారు.

మొదట ప్రభాస్, తరువాత పవన్ కళ్యాణ్.

ప్రభాస్, చరణ్‌తో మాట్లాడిన విధానం చూస్తుంటే వారిద్దరూ ఎంత క్లోజ్ అనేది అర్ధమవుతుంది.

ఇక ఎన్టీఆర్, చరణ్ స్నేహం ఏ రేంజ్‌లో ఉందో మనం చూసాం.

మహేష్ బాబుతో కూడా అదే రేంజ్‌లో ఫ్రెండ్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు.

ఇక రానా, శర్వానంద్, అఖిల్, మంచు మనోజ్ చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నారు. అలాగే మెగా హీరోలంతా చరణ్‌తో క్లోజ్‌గా ఉంటారు.