మంచు మనోజ్, భూమా మౌనికరెడ్డి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
కాగా వీరిద్దరి పెళ్లి నిన్న (మార్చి 3) ఘనంగా జరిగింది.
నిన్నటి వరకు ఈ పెళ్లి ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది.
నిన్న ఉదయం మనోజ్.. తను చేసుకోబోయే వధువు అంటూ ట్వీట్ చేయడంతో సస్పెన్స్ వీడింది.
హైదరాబాద్లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య భూమా మౌనికని వివాహం చేసుకున్నాడు మనోజ్.
మంచు లక్ష్మి దగ్గర ఉండి ఈ పెళ్లి పనులు అన్ని చూసుకుంది.
కాగా మనోజ్ అండ్ మౌనికలకు ఇది రెండో పెళ్లి.
గతంలో వీరిద్దరికి విడివిడిగా వివాహం అయ్యింది.