మాస్టర్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భామ
'మాళవిక మోహనన్'.
మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్‌కి హీరోయిన్‌గా మాళవిక చేస్తుంది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా ద్వారా మాళవిక ఇంటరాక్ట్ అవ్వగా, దీని గురించి ప్రశ్నించారు నెటిజెన్లు.
ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నాను అని చెప్పకుండా, ప్రస్తుతం ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.
దీంతో మాళవిక, ప్రభాస్‌తో నటిస్తున్న వార్తలు నిజమే అంటున్నారు నెటిజెన్లు.
కాగా ఈ సినిమా హారర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుంది.
మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిధి కుమార్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.