ప్రభాస్, కృతిసనన్ కలిసి ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇటీవల కాలంలో వీరిద్దరి ప్రేమలో ఉన్నారంటూ గట్టిగా వార్తలు వినిపించాయి.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అన్న మాటలకూ ఈ రూమర్స్ మొదలయ్యాయి.
మొదట కృతి కూడా ఈ రూమర్స్‌ని పట్టించుకోలేదట. కానీ తన ఫ్రెండ్స్ నుంచి కూడా..
కంగ్రాట్యులేషన్స్ మెసేజ్‌లు రావడం స్టార్ట్ అవ్వడంతో క్లారిటీ ఇద్దామని ప్రభాస్‌కి కాల్ చేసిందట.
ఇక కాల్ లిఫ్ట్ చేసిన ప్రభాస్.. అసలు వరుణ్ ఎందుకు అలా చెప్పాడంటూ కృతిని క్వశ్చన్ చేశాడట.
కృతి బదులిస్తూ.. వరుణ్ మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నాము అని అనుకున్నాడు అని చెప్పిందట.
అది విన్న ప్రభాస్ నవ్వాడు అని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృతి చెప్పుకొచ్చింది.