ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి.

తరువాత శ్యామ్ సింగరాయ్, బంగారాజు సినిమాలు కూడా హిట్ అవ్వడంతో టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంది.

కానీ ఆ తరువాత నటించిన మూడు సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. ఈ అమ్మడి కెరీర్ డైలమాలో పడింది.

దీంతో ఇప్పుడు కథల ఎంపికలో సెలెక్టివ్‍గా వ్యవహరిస్తుంది.

ప్రస్తుతం మాలయంలో ఒక సినిమా చేస్తుండగా, తెలుగులో ఒక క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తుంది.

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. 

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తుంది. 

మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.