టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ కాలేజీ టైంలో గంజాయి అమ్మాను అంటూ తెలియజేశాడు.

కోన వెంకట్ రైటర్‌గా వర్క్ చేసిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ప్రమోషన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

నా కాలేజీ ఫ్రెండ్ తన ఆర్ధిక అప్పులు తీర్చుకోడానికి గంజాయి పండించి, దాని అమ్మడానికి వెళ్లి పోలీసులకు దొరికిపోయాడు  - కోన వెంకట్

ఆ తరువాత ఆ ఫ్రెండ్ సూసైడ్ చేసుకొని చావుబతుకుల్లో ఉన్న సమయంలో మాకు వాడి గురించిన విషయం తెలిసింది  - కోన వెంకట్

దీంతో వాడి అప్పులు ఎలాగైనా తీర్చాలనే ఆలోచనతో.. మేమే గంజాయి అమ్మడానికి గోవా బయలుదేరాం - కోన వెంకట్

మా నాన్న డీఎస్పీ కావడంతో ఆయన కారు వేసుకొని పక్కా ప్లాన్‌తో.. మహబూబ్ నగర్, కర్ణాటక, గోవా బోర్డర్‌లు దాటి వెళ్లి గంజాయి అమ్మి డబ్బులు తీసుకు వచ్చాము - కోన వెంకట్

వాటితో మా స్నేహితుడి అప్పులు అన్ని తీర్చేశాము. అయితే అప్పుడప్పుడు ఒకటి అనిపిస్తుంది. ఆ సమయంలో మేము దొరికిపోతే మా పరిస్థితి ఏంటి అని చాలా సార్లు అనుకున్నా - కోన వెంకట్

నా లైఫ్‌లో జరిగిన ఈ సంఘటని సినిమాగా చేద్దామని అనుకుంటున్నా - కోన వెంకట్