బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
గత కొంత కాలంగా సీక్రెట్ ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ ఏడడుగులు వేసి కొత్త జీవితం మొదలు పెట్టారు.
ఎటువంటి హంగామా లేకుండా సడన్‌గా పెళ్లి వార్తని చెప్పిన కియారా, సిద్దార్ద్..
రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో పంజాబీ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.
ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు జరిగిన ఈ పెళ్లి వేడుక ముగిసింది.
పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు ఏవి బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు ఈ జంట.
తాజాగా అభిమానులు కోసం పెళ్లికి సంబంధించిన ఫోటోలను..
కియారా అండ్ సిద్దార్ధ్ తమ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.