టాలీవుడ్ సీనియర్ నటుడు 'కైకాల సత్యనారాయణ' డిసెంబర్  23న మరణించారు.

పౌరాణికం, జానపదం.. ఇలా అన్ని జోనర్లో నటించి "నవరస నటనా సార్వభౌమ" అనిపించుకున్నారు.

కెరీర్ మొదటిలో సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా నటించారు కైకాల. ఆ తరువాత ఎన్టీఆర్ సహాయంతో సినిమా ఛాన్సులు అందుకున్నారు.

'అరుంధతి' సినిమా రిలీజ్ సమయంలో తన మనసులోని కోరికను బయటపెట్టారు.

"870 సినిమాల్లో నటించిన నేను.. 1000 కాకపోయినా 900 సినిమాల్లో అయినా నటించాలి" అంటూ తన కోరికను చెప్పారు.

కానీ ఆ కోరిక నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు.

అయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి.

ఏదేమైనా తెలుగుతెరపై ఆయన గుర్తులు చిరస్మరణీయం.