యశ్ అండ్ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీని సంపదించుకున్నారు.
ఇటీవల వీరిద్దరి మీద ఒక రూమర్ బాలీవుడ్‌లో మొదలైంది.
కేజీఎఫ్ సెట్ లో యశ్, శ్రీనిధిని వేధించినట్లు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ట్వీట్ చేశాడు.
ఇది కాస్త కన్నడలో వైరల్ అవుతుండడంతో శ్రీనిధి రియాక్ట్ అయ్యింది.
యశ్ ఒక మంచి వ్యక్తి, స్నేహితుడు, గురువు, ఇన్‌స్పిరేషన్.
సోషల్ మీడియాని కొంతమంది దుర్వినియోగం చేస్తుంటారు.
కానీ నేను ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఉపయోగిస్తాను.
కేజీఎఫ్ వంటి సినిమాలో రాకింగ్ స్టార్ యశ్‌తో కలిసి పని చేసే గౌరవం నాకు దక్కింది అంటూ చెప్పుకొచ్చింది.