కార్తీకదీపం 1500 ఎపిసోడ్స్ సెలబ్రేషన్స్

పాపులర్ టీవీ సీరియల్ కార్తీకదీపం తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇందులో నటించిన నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్, శోభా శెట్టి వారి అసలు పేర్లకంటే కూడా సీరియల్ లోని క్యారెక్టర్స్ డాక్టర్ బాబు, వంటలక్క, మోనితగా ఫేమస్ అయ్యారు.

తాజాగా ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ పూర్తి చేయడంతో సీరియల్ యూనిట్ షూటింగ్ టైంలో సెలబ్రేషన్స్ నిర్వహించారు.