గత కొన్ని రోజులుగా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమ టాపిక్ బాలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నాని MCA సినిమాలో విలన్ గా నటించిన ‘విజయ్ వర్మ’తో తమన్నా ప్రేమలో ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో వీరిద్దరూ కిస్ చేసుకుంటున్న ఒక వీడియో బయటకి రావడంతో ఈ చర్చ మొదలైంది.
ఆ తరువాత ముంబై ఎయిర్ పోర్ట్‌లో కలిసి కనిపించడంతో, ఆ వార్తలకి ఇంకొంచెం బలం చేకూరింది.
తాజాగా ఈ జంట మరోసారి కెమెరా లెన్స్‌కి చిక్కారు.
బాలీవుడ్ లోని ఒక అవార్డుల వేడుకల్లో తమన్నా రెడ్ కార్పెట్ పై కెమెరాకు ఫోజులు ఇస్తుంది.
ఆ సమయంలో విజయ్ వర్మ సడన్‌గా వచ్చి ఆమెతో కలిసి కెమెరాకి పోజులిచ్చాడు. అంతేకాదు ఆ వేడుకలో చెట్టపట్టాలు వేసుకొని ఇద్దరు సందడి చేశారు.
దీంతో వీరిద్దరూ నిజం గానే ప్రేమలో ఉన్నారు అంటున్నారు నెటిజెన్లు.