శ్రీముఖి టాలీవుడ్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టింది.

అల్లు అర్జున్ జులాయి సినిమాలో చెల్లెలు క్యారెక్టర్ చేసి వెండితెరకు పరిచమైంది.

ఇక అప్పటి నుంచి యాంకర్‌గా, నటిగా ఛాన్సులు అందుకుంటూ వస్తుంది.

తాజాగా ఒక బంపర్ ఆఫర్ కొట్టేసిందట.

చిరంజీవి భోళాశంకర్ సినిమాలో ఖుషి నడుము సీన్ ఉండబోతుందని సమాచారం.

పవన్ రోల్‌లో చిరు, భూమిక రోల్‌లో శ్రీముఖి పెట్టి దర్శకుడు మెహర్ రమేష్..

ఖుషి సీన్ రీ క్రియేట్ చేస్తూ కామెడీ జెనెరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ అదే నిజం అయితే ఆ సీన్ ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.