టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడు శర్వానంద్.
ఇటీవల అన్‌స్టాపబుల్ షోలో కూడా బాలయ్య, శర్వానంద్‌ని పెళ్లి గురించి ప్రశ్నించాడు.
ప్రభాస్ తరువాత చేసుకుంటా అంటూ బదులిచ్చాడు శర్వానంద్.
ఇప్పుడు ఈ 38 ఏళ్ళ యువహీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట.
ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర బంధువు అని తెలుస్తుంది.
ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ పరిచయమయ్యారని తెలుస్తుంది.
ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా తెలుస్తుంది.