RRR తరువాత మరో భారీ మల్టీస్టార్రర్ సౌత్‌లో సెట్ కాబోతుంది.

సౌత్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, ధనుష్ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గతంలో ధనుష్‌తో 'అసురన్' సినిమా తెరకెక్కించిన వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకత్వం చేయబోతున్నాడట.

అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా భారీ స్కేల్‌లో రాబోతుంది.

ఫస్ట్ పార్ట్‌ని ఎన్టీఆర్ లీడ్ చేస్తాడట.

సెకండ్ పార్ట్‌ని ధనుష్ లీడ్ చేస్తాడట.

సినిమాని రస్టిక్‌గా ఊర మాస్‌గా తెరకెక్కించడంలో వెట్రిమారన్ దిట్ట. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు. అది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.