మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. 

RRR కంటే ముందు చరణ్ రంగస్థలం సినిమాలో చిట్టిబాబుగా తన నటనా విశ్వరూపం చూపించాడు.

ఆ సినిమాలో చరణ్ నటనకి నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అనుకున్నారు.

చరణ్‌కి నేషనల్ అవార్డు రాకపోవడంతో చాలా మంది బాధపడ్డారు. తాజాగా చిరంజీవి కూడా తన బాధని బయటపెట్టాడు.

నిన్న వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌కి రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చాడు. RRR, రంగస్థలంలో చరణ్ నటన గురించి మాట్లాడుతూ..

రంగస్థలంలో చెవిటివాడిగా చిట్టిబాబు పాత్రలో చరణ్ నటన అద్భుతం.

చరణ్‌కి ఆ సినిమాకి జాతీయ అవార్డు రాకపోవచ్చు కానీ ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ఎంతో ప్రేమని సంపాదించుకున్నాడు.

రామ్ చరణ్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యాడు.