95వ అకాడమీ అవార్డుల నామినేషన్ లిస్ట్‌ని నేడు ప్రకటించారు.

ఈ నామినేషన్స్‌లో మొత్తం మూడు భారతీయ సినిమాలు నిలిచాయి.

ముందు నుంచి అందరూ అనుకున్నట్లే RRR మూవీ ఆస్కార్‌కి ఎంపిక అయ్యింది. 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' ఆస్కార్ నామినేషన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

కేవలం ఈ ఒక్క క్యాటగిరీలోనే RRR ఎంపిక అయ్యింది. ఈ సినిమాతో పాటు మరో రెండు ఇండియన్ మూవీస్ కూడా ఆస్కార్‌కి సెలెక్ట్ అయ్యాయి.

డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ నామినేట్ అయ్యింది.

డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ‘అల్ ది బ్రీత్స్’ నామినేషన్‌లో నిలిచింది.