ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని అందుకోడానికి ప్రపంచంలోని సినిమా స్టార్స్ అంతా ఎదురు చూస్తుంటారు.

బంగారంలా కనిపించే ఆస్కార్ అవార్డు కాంస్యంతో (Bronze) చేసి పైన 24 కారెట్స్ గోల్డ్ తో పూత పూస్తారు.

ఈ అవార్డుని తయారు చేయడానికి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. 

అయితే ఆస్కార్ గెలుచుకున్న వారు దానిని అమ్ముకోవచ్చా? అంటే ఒకప్పుడు లేదు.

కానీ 1950లో ఆస్కార్ గెలుచుకున్న అమెరికన్ డైరెక్టర్ 'ఆర్సన్ వెల్స్' ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ వల్ల ఆస్కార్‌ని వేలం వేశాడు.

ఆ వేలంలో ఆరున్నర కోట్ల వరకు వచ్చాయి. అయితే ఆ పనికి ఆస్కార్ అకాడమీ సీరియస్ అయ్యి..

ఒకవేళ ఆస్కార్ అమ్ముకోవాలి అంటే తమకే అమ్మాలి అనే రూల్ తీసుకు వచ్చింది.

అయితే ఆ అవార్డుని అకాడమీ కేవలం 1 డాలర్‌కి మాత్రమే కొనుగోలు చేస్తుంది. 1 డాలర్‌కి ఆస్కార్ అమ్ముకోవాలని ఎవరు అనుకోరని అకాడమీ ఆ రూల్ పెట్టింది.