హిట్ 2
చిత్ర యూనిట్ సక్సెస్ టూర్..
నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 తెరకెక్కింది.
హిట్ 2 లో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు.
ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
ఈ సినిమాకి 15 కోట్ల బడ్జెట్ పెట్టగా ఇప్పటికే 35 కోట్లు కలెక్ట్ చేసింది.
సినిమా విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ వేశారు.
ఈ టూర్ లో భాగంగా విజయవాడ వెళ్లగా అక్కడి ఫేమస్ బాబాయ్ హోటల్ కి వెళ్లి టిఫిన్ తిన్నారు చిత్ర యూనిట్.
అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.