హీరోయిన్ సమంత ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకొని, తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొంటుంది.
ఈ క్రమంలోనే హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల’ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది.
ఈ వెబ్ సిరీస్‌లో సమంత గూఢచారిగా నటిస్తుంది.
దీంతో యాక్షన్ సీన్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండడంతో..
ఒక ఎపిసోడ్ షూటింగ్‌లో సమంత చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఆ గాయాలు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ..
'ఈ గాయాలు నన్ను మరిన్ని యాక్షన్ సీక్వెన్స్ చేసేలా ప్రోత్సహిస్తున్నాయి' అంటూ కామెంట్ చేసింది.
ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు.. వర్క్ పై తనకి ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు.