అందాల రాక్షసి సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి 'లావణ్య త్రిపాఠి'.

ఈ భామ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడిందట. 

వీరిద్దరూ మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు.

ఆ సినిమాల షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారని గతంలో కూడా వార్తలు వినిపించాయి.

తాజాగా లావణ్య 'పులిమేక' అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో యాంకర్ సుమ..

నాని, వరుణ్ తేజ్ ఇద్దరిలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు? అని ప్రశ్నించింది.

దీనికి లావణ్య.. వరుణ్ తేజ్ అని ఆన్సర్ చేయగా, అక్కడు ఉన్న వారంతా ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టారు.

దీంతో లావణ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిగ్గుపడింది. 

ఇటీవల నాగబాబు కూడా.. త్వరలో వరుణ్ తన చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేయబోతున్నట్లు తెలియజేశాడు.